Home Politics Andhra Pradesh సిరిమాను అధిరోహించడం పోలమాంబ కల్పించిన మహాభాగ్యం..!

సిరిమాను అధిరోహించడం పోలమాంబ కల్పించిన మహాభాగ్యం..!

0

రాష్ట్ర గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన ఉత్తరాంధ్రల ఇలవేల్పు శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరలో నేడు అనగా మంగళవారం నాడు సిరిమానోత్సవ కార్యక్రమంలో సిరిమాను అధిరోహించడం మా పూర్వజన్మ సుకృతం , ఆ పోలమాంబ అమ్మవారి కల్పించిన మహా భాగ్యమని పూజారి జన్నిపేట జగదీశ్వరరావు తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. తమ గిరిజన కుటుంబంలో వెలసిన శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరలో అలనాడు మా తాత ముత్తాతల నుండి మా తండ్రి జన్నిపేకాపు జగ్గందొర మరణం తరువాత వారసులమైన తాను, నా సోదరుడు జన్మి పేకాపు రామారావే సిరిమాను అధిరోహిస్తున్నామని పూజారి జన్నిపేకాపు జగదీశ్వరరావు తెలిపారు. ఇది ఆ తల్లి పోలమాంబ అమ్మవారు మాకు కల్పించిన వరమని ఈ సందర్భంగా పూజారి తెలపడం విశేషం.! తాము ఇద్దరు సోదరులు సోదరులమైనందున ఒక ఏడాది నేను సిరిమాను అధిరోహించగా..! మరో ఏడాది నా సోదరుడు జన్నిపేకపు రామారావు సిరిమాను అధిరోహిస్తారని ఆయన తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version