Home Politics Andhra Pradesh అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష

అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష

0

అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే లుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా శనివారం అనకాపల్లి జిల్లాలో గల ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మీద సమీక్షించారు. అలాగే రాష్ట్రంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు పరిపాలన విధానం ప్రజా స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే రానున్న రోజుల్లో అనుసరించవలసిన విధి విధానాలు తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు,
శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు , జిల్లా ఇంచార్జీ మంత్రి కొల్లు రవీంద్ర , హోమ్ మంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ ఎంపీ
సీఎం రమేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా సహచర ఎమ్మెల్యే అందరూ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version