Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradesh23న చంద్రబాబు రాక

23న చంద్రబాబు రాక

మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్న సీఎం

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఈ నెల 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా జరగనున్న ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మరియు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమం జరగనున్న ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షిస్తూ హెలీపాడ్ వద్ద జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు. ఈ భారీ బహిరంగ సభకు మంత్రులు, ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, సభా ప్రాంగణం చుట్టూ పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా సభా వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని హోం మంత్రి అనిత సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments