Home Uncategorized లండన్ లో చంద్రబాబు – ఘనస్వాగతం పలికిన అభిమానులు

లండన్ లో చంద్రబాబు – ఘనస్వాగతం పలికిన అభిమానులు

0

ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు, భువనేశ్వరిలు లండన్ వెళ్లారు. చంద్రబాబు దంపతులకు లండన్ తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికారు. లండన్ తెలుగు కుటుంబాలను చంద్రబాబు అప్యాయంగా పలకరించారు. ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి నారా భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు.

డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో నారా భువనేశ్వరి కృషికి గుర్తించారు. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్​కు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో నారా భువనేశ్వరి అవార్డు అందుకోనున్నారు. అవార్డు స్వీకరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

మేనేజింగ్‌ ట్రస్టీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌’ సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ అవార్డును నవంబరు 4న లండన్‌లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌’ విభాగంలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డునూ ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. ఈ కార్యక్రమం లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలనా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.

గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, హిందూజా గ్రూప్‌ కో ఛైర్మన్‌ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్‌ ఛైర్‌పర్సన్‌ రాజశ్రీ బిర్లా తదితరులు ఈ అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు లండన్‌ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. నవంబరు 6న ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు.

అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా సరసన భువనేశ్వరి: నారా భువనేశ్వరి ప్రజాసేవ రంగంలో చేసిన కృషికి లండన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025 కు ఎంపిక చేసింది. ఈ అవార్డుని ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ రికగ్నిషన్‌గా పరిగణిస్తారు. ప్రజా సేవ, సామాజిక ప్రభావం, నాయకత్వం వంటి అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రతి ఏడాది ఈ అవార్డు అందజేస్తారు. 2025కు గాను నారా భువనేశ్వరికి ఈ అవార్డుకి ఎంపిక చేశారు.

ఇంతకు ముందు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కోఛైర్మన్ గోపీచంద్ హిందూజా, ఆదిత్య బిర్లా గ్రూప్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ఛైర్‌పర్సన్ రాజశ్రీ బిర్లా వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు అందుకున్నారు. ఆ జాబితాలో నారా భువనేశ్వరి సైతం చేరారు. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, విపత్తు సహాయం వంటి రంగాల్లో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, ఎన్టీఆర్ విద్యార్థి సహాయ పథకాలు, విపత్తు నిర్వహణ సేవలు, మహిళల ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి మన్ననలు పొందాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version