Home Politics Andhra Pradesh ఉత్తరాంధ్ర సూచన స్రవంతికి ఊపిరి పోయండి

ఉత్తరాంధ్ర సూచన స్రవంతికి ఊపిరి పోయండి

0

వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను ఆదుకోండి అసెంబ్లీలో ఎమ్మెల్యే విజ్ఞప్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంగా మిగిలిన బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఊపిరి పోయాలని చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అయన అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో చోడవరం, మాడుగుల, నర్సీపట్నం వ్యవసాయ ఆధారిత ప్రాంతాలని ఇక్కడ పారిశ్రామిక ప్రగతి లేదని చెప్పారు. అదే పాయకరావుపేట, ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను ఆదుకునేందుకు 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చోడవరంలో సుజల స్రవంతి పథకానికి శంకుస్థాపన చేశారన్నారు. తదుపరి వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని నిర్లక్ష్యం చేసేయన్నారు.దీంతో మా ప్రాంతాలు సాగునీటికి ఇబ్బంది పడుతున్నాయని వివరించారు. ఈ నేపద్యంలో గోదావరి ప్రాంతాల వలె మా ప్రాంతాల్లో కూడా మూడు పంటలు పండాలంటే పోలవరం లాంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఊపిరి పోసి ఈ ఏడాది పనులు ప్రారంభించాలని కోరారు. ఫలితంగా 2029 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంటది అన్నారు. శ్రీకాకుళం వరకు మూడు ఫేజ్ లలో గల ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లా తొలి ఫేజ్ లో ఉందని తెలిపారు. అలాగే రైతాంగానికి అండగా ఉండే గోవాడ తుంపాల ఏటికొప్పాక తాండవ చక్కెర కర్మ గారాలను తిరిగి తెరిపించాలని రైతులకు చేదోడుగా నిలవాలని కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version