ఆదివాసి ప్రాంతంలో బిజెపి జెండా ఎగరేస్తాం*
బీజేపీ అల్లూరి జిల్లా అధ్యక్షులు శాంత కుమారి
ఆదివాసి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడిస్తామని ఆ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు మఠం శాంత కుమారి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాడేరు జి.మాడుగుల మండలం లువ్వా సింగిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాడేరు పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను శాంత కుమారి ఆవిష్కరించారు. ముందుగా శాంత కుమారి స్వగృహంపై ఇంటింటా జండా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా బిజెపి జెండాను ఎగరవేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో *శాంత కుమారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి పల్లెకు రహదారి నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో గిరిజన ప్రాంతంలో గ్రామాలకు గ్రామాలు అనుసంధానం చేస్తూ వేల కోట్ల నిధులను వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోడ్లు నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. ఎన్నడూ లేని విధంగా ఆదివాసి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోనే అత్యధికంగా జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉండకూడదని … కనీస సదుపాయాలు వారికి దూరం అవ్వకూడదన్న ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తుందన్నారు. అంత్యోదయ స్ఫూర్తితో సుపరిపాలనే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పాలన సాగిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. సేవే పరమావధిగా దేశమే ప్రప్రథమంగా జన సంఘ కాలము నుంచి నేటి వరకు పార్టీ జెండాను మోసిన మహనీయులను ఈ సందర్భంగా ఆమె స్మరించుకున్నారు. దేశ సేవకే అంకితమై నిరంతరం శ్రమిస్తున్న కోట్లాదిమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆదివాసీల మనసు గెలిచి వాడవాడలా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి తీరుతామని ప్రతినిబూనారు.
*పాడేరుకు మెడికల్ కళాశాల ఇచ్చింది మోడీ
గిరిజనులకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఆనాడు ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో భాగంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్న విధాన నిర్ణయాల్లో భాగంగా పాడేరుకు మెడికల్ కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని శాంత కుమారి గుర్తు చేశారు.
