Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshపఠాన్ ఫరీద్ ను పరామర్శించిన బియ్యపు మధుసుధన్ రెడ్డి

పఠాన్ ఫరీద్ ను పరామర్శించిన బియ్యపు మధుసుధన్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్ తండ్రి పఠాన్ కాలేషా అనారోగ్యంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. పఠాన్ కాలేశా మృతి చెందిన రోజు స్థానికంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి లేరు. ఆయన బుధవారం శ్రీకాళహస్తికి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పఠాన్ ఫరీద్ తండ్రి పఠాన్ కాలేషా మృతి చెందారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.వెంటనే జయరాంరావు వీధిలోని పఠాన్ ఫరీద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పఠాన్ కాలేషా మృతి శ్రీకాళహస్తి పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆవేద వ్యక్తం చేశారు.గత ఎన్నికల్లో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడని గుర్తు చేశారు.పఠాన్ ఫరీద్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments