అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి సంస్థ ప్రాజెక్ట్స్ చీఫ్ జనరల్ మేనేజర్ బి. అశోక్ కుమార్ మరియు కార్పొరేట్ కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.
