Home Politics Andhra Pradesh పోలిసుల ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు సిబ్బందికి అవగాహన కార్యక్రమం.

పోలిసుల ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు సిబ్బందికి అవగాహన కార్యక్రమం.

0

అల్లూరి జిల్లా కొయ్యురు పరిధిలో ఈ రోజు కొయ్యురు సీఐ , ఎస్సై కలిసి ఏపీఆర్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులు మరియు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆత్మ నియంత్రణ, మొబైల్ ఫోన్లను అధికంగా మరియు అనవసరంగా వినియోగించడం వల్ల కలిగే దుష్పరిణామాలు, వృత్తి మార్గదర్శకత్వం, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన, అలాగే పాఠశాల స్థాయిలో క్రీడల ప్రాముఖ్యత గురించి వివరించారు.అదనంగా పాఠశాల సిబ్బందికి రోడ్డు భద్రతా నియమాలు మరియు మహిళలపై జరిగే నేరాల నివారణ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులు మరియు సిబ్బంది సానుకూలంగా స్వీకరించారని, సురక్షితమైన మరియు క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో కొయ్యురు సీఐ శ్రీనివాస్,
ఎస్సై కిషోర్ వర్మ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version