– చంద్రబాబుకి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్న
– టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్స్యకరంగా ఉన్నాయని
తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో దూషించిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవిగా తెలిపారు. ముఖ్యమంత్రిని ఈ విధంగా అసభ్య పదజాలంతో దూషించడం తీవ్రంగా ఖండిస్తున్నానని, తిరుపతిలో జరిగిన కల్తీ లడ్డు ఘటనపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్మోహన్ రెడ్డి అండతో అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడినట్టు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో జరిగిన రాజకీయ అవమానం ఇంకా సరిపోలేదని ప్రజలు ఇచ్చిన గుణపాఠాన్ని ఇంకా నేర్చుకోకుండా, జగన్మోహన్ రెడ్డి తొత్తులను పంపించి చంద్రబాబు నాయుడుపై ఏదిపడితే అది మాట్లాడిస్తూ శునకానందం పొందుతున్నాడన్నారు.
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని, ఇకనైనా వైఖరిని మార్చుకోవాలని, ప్రజల ముందుకు వెళ్లేటప్పుడు ఎలా మాట్లాడాలో మీ నాయకులకు కనీసం నేర్పి పంపాలని సూచించారు. భవిష్యత్ లో ఇలాగే వైసీపీ నేతలు మాట్లాడితే చెప్పుల దండ వేసి చీపుర్లతో కొట్టే విధంగా చేసుకోవద్దని లక్ష్మయ్య హెచ్చరించారు.
