లేడీస్ హాస్టల్ కు ఆశాలత,ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల మరియు రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్ గా కెమిస్ట్రీ విభాగం ఆచార్యులు వి.సిద్ధయ్య నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను ఆచార్య వి.సిద్ధయ్య స్వీకరించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే విధంగా నిరంతర పర్యవేక్షణతో పని చేయాలని విసి సూచించారు. సిబ్బందితో సమన్వయం చేస్తూ హాస్టల్స్ను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.
– లేడీస్ హాస్టల్ చీఫ్ వార్డెన్ గా ఆచార్య ఆశాలత
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కామర్స్ కళాశాల బాలికల హాస్టల్ (మహారాణిపేట) చీఫ్ వార్డెన్ గా ఎకనామిక్స్ విభాగం ఆచార్యులు డి. ఆశాలత నియమితులయ్యారు. ఈరోజు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను ఆచార్య ఆశాలత స్వీకరించారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన వాతావరణంలో, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విధంగా నిరంతర పర్యవేక్షణతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జాలాది రవి పాల్గొన్నారు. అనంతరం ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, పలువురు ఆచార్యులు ఆచార్య ఆశాలతను అభినందించారు
