Saturday, April 18, 2026
HomeNewsజగన్ కు ఏబిఎన్ ఆర్ కె క్షమాపణ చెప్పాలి. ........... ................పెండ్ర వీరన్న

జగన్ కు ఏబిఎన్ ఆర్ కె క్షమాపణ చెప్పాలి. ……….. …………….పెండ్ర వీరన్న

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మహిళలను అసభ్యకరంగా ముద్రిస్తూ ఏ బి ఎన్ రాధాకృష్ణ బూతు రాతలు రాయటం జరిగింది ఆ సందర్భంగా* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున, హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి, ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ కార్యక్రమంలో ఉన్న దళిత శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ని, బీసీ సామాజిక వర్గానికి చెందిన శాసనమండలి సభ్యులు మరియు రాష్ట్ర ఆ పార్టీ బిసి విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాచుగుల్ల రమేష్ యాదవ్ ను , పోలీసులు దౌర్జన్యంగా మెడ మీద చేయి వేసి గెంటివేత అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఆ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న* పశ్చిమగోదావరి జిల్లా ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికను క్యాలెండర్ గా మార్చి. కూటమి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు కు ప్రసారానికి మాత్రమే ఉపయోగపడుతుందని. చంద్రబాబు నాయుడు ఆనందం కోసమే, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆ పార్టీ నాయకుల భార్యలపై అసభ్యకరమైన రాతలు రాశారని అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆ పార్టీ నాయకులను పోలీసులను అడ్డంపెట్టుకుని కూటమి అరాచక పాలన నడిపిస్తుందని, అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , సీఎం చంద్రబాబు నాయుడు కి వత్తాసు పలుకుతున్నారని పెండ్ర వీరన్న అన్నారు, మాజీ సీఎం జగన్ కి ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పకపోతే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని ఆయన హెచ్చరించారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments