పంచాయితీ అధికారులు వస్తారు వెళతారు
చిన్న సమస్యలకు సేనా ఏళ్ళు
ప్రజా సమస్య చిన్నది పరిష్కారానికి చాలా ఏళ్లు పట్టి స్థానిక ప్రజానీకం జబ్బుల బారిన పడి ఆసుపత్రులకు ఆదాయాన్ని అందజేసిన వైనాన్ని టెక్కలి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు భాగమైన ప్రజా పారిశుధ్య సంస్థ లైన పంచాయితీ కార్యాలయం అధికారులు అనధికారులు, రోజువారి వీధుల్లో పారిశుద్ధ్యo చూస్తూ ఉంటారు దానికి ప్రత్యామ్నాయం ఏదీ చూడరు ఇలా వీధులన్నీ మురికి కూపాలుగా మురికి నీరు ప్రవాహాలు కొనసాగుతూనే ఉంటాయి, స్థానికులు కూడా తమ పరిసరాలు పరిశుభ్రతకు సహకరించరు, ఇది నిత్యం పట్టణ పురవీధుల్లో జరుగుతున్న ప్రధాన సమస్య మురికి నీరు, దీన్ని బాధ్యతాయుతంగా సంబంధిత అధికారులు, స్థానికుల సమన్వయంతో ఇ టువంటి చిన్న సమస్యను పెద్ద మనసుతో అంగీకరించి మురికి నీటి ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి రోగాల బారిన ప్రజలు పడకుండా ఆరోగ్య ప్రధానమైన ముందు చూపుతో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సమస్యలను సానుకూలంగా స్పందించి తక్షణమే మురికి లేని వీధులుగా పారిశుద్ధ్యనికి పెద్దపీట వేయాలని స్థానికులు కోరుతున్నారని శ్రీకాకుళం జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ సిహెచ్ లింగరాజు విజ్ఞప్తి చేస్తున్నారు.
