Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshపదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు. డీఎస్పీ శ్రీనివాసరావు

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు. డీఎస్పీ శ్రీనివాసరావు

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నర్సీపట్నం డిఎస్పి పి. శ్రీనివాసరావు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు
నర్సీపట్నం డివిజన్ వ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా , సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు డిఎస్పి పి.శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే పరీక్షా పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో మరియు సమాధాన పత్రాలను తిరిగి తీసుకెళ్లే సమయంలో కూడా పోలీసు బందోబస్తు కల్పించనున్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనవసరంగా వ్యక్తులు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు , పరీక్ష విధులు నిర్వహించే సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండరాదని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా లేదా వారికి సహకరించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ .పి. శ్రీనివాసరావు హెచ్చరించారు.
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు పోలీసు శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments