వాడవాడల అక్షరాంధ్ర పరీక్షలు
ప్రతి మహిళకు చదువు రావాలని తద్వారా సంతకం చేయాలని డబ్బులు లెక్క చూడాలన్న ఆశయంతో ప్రభుత్వం అక్షరాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నిరక్షరాస్యులైన డ్వాక్రా మహిళలను, ఉపాధి కూలీలను గుర్తించి వారికి విద్యా వంతులతో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారందరికీ రెడ్డి విడతలలో పరీక్షలు నిర్వహించారు. దానిలో భాగంగా ఆదివారం మాడుగుల మండలంలో డ్వాక్రా గ్రూపు సభ్యులకు, ఉపాధి కూలీలకు అక్షరాంధ్ర విభాగంలో కలెక్టర్ ఆదేశాల ప్రకారం రెండో విడత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4o96 మందికి 416 మంది టీచర్ల పర్యవేక్షణలో సచివాలయాల స్థాయిలో పాఠశాలల్లోనూ, అంగన్వాడి కేంద్రాల్లోనూ, పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఎండి ఒ కే అప్పారావు, వెలుగు ఏపీఎం రమణి కుమారి తదితరులు పర్యవేక్షించారు. నేడు ప్రతి మహిళ రెండు లక్షలు కి పైబడి డ్వాక్రా రుణాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి లెక్కలు చూడడం, సంతకాలు పెట్టడం అనేవి కచ్చితంగా రావాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరు సంతకం చేయాలి తప్ప వేలిముద్ర చేయకూడదని నిర్ణయించారు. దీంతో అక్షరాంధ్ర విభాగంలో గుర్తించిన వారందరికీ పరీక్షలు నిర్వహించారు.
