Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం

ప్రజా ప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుదు తోట ముకుంద్
ఎంవీపీ కాలనీ, ఉషోదయ జంక్షన్ వద్ద ప్రజా ప్రస్థానం పార్టీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పార్టీ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం ప్రజా ప్రస్థానం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తోట ముకుంద్ మీడియాతో మాట్లాడుతూ
మాయమాటలతో ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి , ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పారు.
ప్రభుత్వం చెబుతున్న దానికి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని తెలిపారు.
క్రీడలు పోటీలు అంటూ సాంస్కృతిక కార్యక్రమాలు అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు కాలక్షేపం చేస్తూ పాలన గాలికి వదిలేసారని విమర్శించారు.
రాష్ట్రంలో ఇప్పటికి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు.
సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని వెల్లడించారు.
అర్హులైన పేదవారికి ప్రభుత్వం ఇల్లు అందించేందుకు మీనా మేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ చాలా దారుణంగా ఉందని చెప్పారు.
రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదని,
అక్కడ మౌలిక సదుపాయాలు సరిగా లేకపోగా అక్కడ పనిచేసే సిబ్బంది రోగులను లంచాలు అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇక సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయన్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు సరిగా లేవని పేర్కొన్నారు.
మంచినీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఉందన్నారు. అక్కడ చదువుకుంటున్న చాలామంది విద్యార్థులు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కేవలం నగరాలు, పట్టణాల వరకే పరిమితం చేసిందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చొరవ చూపాలని చెప్పారు.
పనిచేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments