అభినందించిన కళాశాల యాజమాన్యం
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఐతం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఎం జస్వంత్ కుమార్ ఇటీవల జరిగిన జేఎన్టీయూ విజయనగరం విశ్వవిద్యాలయం లో ఎంపిక కావడం హర్షదాయకమని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు.
ఈ ఆటలో ప్రతిభ కనబరిచిన జస్వంత్ పంజాబ్ రాష్ట్రంలోనీ జలంధర్ డి ఏ వి విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొనడం హర్షదాయకమని ఆయన అన్నారు. విద్యార్థులు సమగ్ర విద్య తో పాటు క్రీడల్లో రాణించి సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, కళాశాలకు ఘన కీర్తి రావాలని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు యాజమాన్యం విద్యార్థులు జస్వంత్ ను అభినందించారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ వై రమేష్, ఫిజికల్ డైరెక్టర్లు లక్ష్మణమూర్తి, మురళీమోహన్, తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
