Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshవైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనార్టీ సెల్ సమావేశం

వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనార్టీ సెల్ సమావేశం

ముఖ్య అతిధిగా బొల్లవరపు జాన్ వెస్లీ

జిల్లా అధ్యక్షులు రెవ. ఎం విజయ సారధి అధ్యక్షతన కొంతమూరు లో వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యాలయము సమావేశం నిర్వహించారు . జిల్లా లో 19 మండలాల్లో ఉన్న క్రైస్తవ నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ మాట్లాడుతూ 2029 లో వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు క్రైస్తవులందరూ పనిచేయాలని కోరారు మాజీ ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవులకు చేసిన మంచి పనులు ఇప్పటివరకు ఏ ప్రభుత్వము చేయ లేదని జగనన్న హయాంలో అర్హత కలిగిన ప్రతి క్రైస్తవ సేవకునికి ఐదువేల రూపాయలు గౌరవ వేతనాన్ని ఇచ్చి క్రైస్తవు లపై వారి ప్రేమను చూపించారని తెలియజేశారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రకమైన సహాయము చేయకుండా మాటలతో మభ్య పెట్టాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలియజేశారు. కానీ రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఓటమిని చవిచూస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు.
జిల్లా అధ్యక్షులు రెవరెండ్ విజయసారథి మాట్లాడుతూ క్రైస్తవులకు హాని తలపెట్టిన ఏ వ్యక్తి గాని ఏ ప్రభుత్వం గానీ నిలబడలేదని క్రైస్తవుల మనసును బాధ పెడుతూ క్రైస్తవులను హింసించిన ఏ రాజు నిలబడలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. క్రైస్తవులు మౌనంగా ఉన్నారని వారిని ఏం చేసినా పర్వాలేదని పాలకులు అనుకుంటున్నారని కానీ క్రైస్తవులు ప్రతి విషయాన్ని నిశ్శబ్దంగా కనిపెడుతున్నారని సమయం వచ్చినప్పుడు వారి శక్తి ఏంటో కూటమి ప్రభుత్వం చూస్తుందని క్రైస్తవులందరూ జగనన్న ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని తెలియజేశారు.
రాష్ట్ర సహాయ కార్యదర్శి రెవరెండ్ వై రాజా మాట్లాడుతూ ఈనెల 24వ తారీఖున క్రైస్తవుల అందరి ఐక్యత కొరకు సభ ఏర్పాటు చేయబోతున్నామని దానికి జిల్లా నలుమూలల నుండి క్రైస్తవ నాయకులు సేవకులు విశ్వాసులు తప్పక హాజరు కావాలని తెలియజేశారు. ఈ సమావేశానికి ఏడు నియోజకవర్గాల నుండి క్రైస్తవ నాయకులు బ్రదర్ పి నవీన్ కుమార్ రెవ. రాబర్ట్ క్లైవ్, రెవ. సుధాకర్, రెవ. సుగుణ రాజ్, రెవ. అబ్రహం రెవ. మధు రెవ. స్పర్జన్ రాజ్ తదితర నాయకులు పార్టీ కోసం కష్టపడి పని చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 12 వ తేదీన జరిగే పార్టీ ఆవిర్భావ సభలలో ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులతో కలిసి పాల్గొనాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విజయ సారథి తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments