Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshరీ సర్వే లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి

రీ సర్వే లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి

బిజెపి అల్లూరి జిల్లా అధ్యక్షులు మఠం శాంత కుమారి

రీసర్వే లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి మఠం సర్పంచ్, భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు మఠం శాంత కుమారి తహసీల్దార్ *శ్రీనివాసరావు సూచించారు. మఠం పంచాయతీ పరిధిలో భూములు రీసర్వే చేయనున్న నేపథ్యంలో బుధవారం గ్రామపంచాయతీలో గ్రామస్తులతో రెవెన్యూ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రెవెన్యూ సిబ్బంది రీ సర్వే నేపథ్యంలో ఏఏ విషయాలు పై అవగాహన ఉండాలో తహసిల్దార్ శ్రీనివాసరావు రైతులకు వివరించారు. ఏ భూమిలో సర్వే చేస్తున్నరో ఆ రైతులకు వారం రోజుల ముందే సమాచారం ఇచ్చి ఎవరి భూమిలో వారు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో *శాంత కుమారి మాట్లాడుతూ పొరపాట్లు జరగకుండా పగడ్బందీగా అన్ని విషయాలపై రైతులు అవగాహన కల్పించి రిసర్వే పనులు ప్రారంభించాలని చెప్పారు. భూమా హద్దులు, సర్వే నంబర్లు విషయంలో అనేక వివాదాలు ఇప్పటికీ రైతులు ఎదుర్కొంటున్నారని భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. రీసర్వేపై రైతులకు ముందు అవగాహన కల్పించి పూర్తిస్థాయిలో రెవెన్యూ సిబ్బందిని కేటాయించి పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments