పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం, నాయుడుపాలెం,వాడ చీపురుపల్లి గ్రామ పంచాయితీలు పరిధిలో గల 14 గ్రామాల ఆరాధ్య దేవతగా పేరుగాంచిన,భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం నేడు 10వ తేదీ మంగళవారం ఘనంగా అమ్మవారి జాతర నిర్వహించనున్నట్లు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కూండ్రపు కృష్ణం నాయుడు తెలిపారు మంగళవారం వేకువజాము నుంచి భక్తులు పసుపు,కుంకుమ, చీర సారె సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు అమ్మవారి జాతరలో భాగంగా కోలాటం నృత్యాలు,తీన్‌మార్ డప్పుల నడుమ అమ్మవారి ఘటాలను గ్రామ పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించి,రాత్రి 9.00 గంటలకు అమ్మవారి ఆలయంలోకి తోడుకువెళ్తారని తెలిపారు.
అమ్మవారి జాతర సందర్భంగా గ్రామమంతా భారీ విద్యుత్ కాంతులతో లైటింగ్ సెట్టింగులు, కోలాటం నృత్యాలు,గ్రామ వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ బేబీ డాన్స్, ఆర్కెస్ట్రా జానపద సాంఘిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. జిల్లా నలుమూలలా నుండి
భక్తులు గ్రామ ప్రజలు అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి కృప ను పొందాలని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కూండ్రపు కృష్ణం నాయుడు కోరారు
నేడు ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం
RELATED ARTICLES
