Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshజీడీ పంటను ప్రభుత్వ గుర్తించి మద్దతు ధర ప్రకటించాలి

జీడీ పంటను ప్రభుత్వ గుర్తించి మద్దతు ధర ప్రకటించాలి

జీడీ పంటను ప్రభుత్వం గుర్తించి దానికి మద్దతు ధర ప్రక టించాలని, జీడికి కార్పొరేషన్ ఎర్పాటు చేయాలని కోరుతూ సోమవారం శంకరం పంచాయతీలో గల గిరిజనలు ఆందోళన చేపట్టారు. కేజీ జీడీ పిక్కలకు రెండు వందలు రూపాయలు ఇవ్వాలని ఇతర దేశాల నుండి దిగు మతి అవుతున్న జీపిక్కలను తక్షణమే నిలుపుదల చేయాలని మన జీడి పిక్కలకు అసెంబ్లీలో చర్చించి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి తదితరులు పాల్గోని మాట్లాడుతూ జీడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్ట పోతు న్నారని తెలిపారు. ప్రభుత్వం వరి,చెరకు, పత్తి పామ్ ఆయిల్ తదితర పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుందని కాని జీడి పంటకు మాత్రం ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక పోవడం అన్యాయమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జీడీ మద్దతు ధర మార్కెట్ సౌకర్యం కోసం చర్చించాలని కోరారు.జీడీ పంటకు నిలకడగా ధర ఉండక పోవడంతో జీడి పిక్కల పంట సమయంలో వ్యాపారులు రైతులకు ధర తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేసారు వ్యాపారుల చేతికి జీడి పిక్కలు చేరిన తరువాత ఆమాంతంగా జీడి పప్పు ధర పెరుగు పోతుందని అన్నాడు.రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రాక నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జీడి పిక్కల ధర ప్రభుత్వం శాస్త్రీయంగ నిర్ణయించి అమలు చేయక పోవడంతో వ్యాపారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.ప్రస్తుతం 80 కేజీల జీడి పిక్కల బస్తాకు వ్యాపారులు రూ. 8,000/-మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో జీడి రైతులు వ్యాపారుల చేతిలో దోపిడీకి గురి అవుతున్నారని తెలిపారు.జీడి పప్పు బస్తా (80 కేజీలు) పిక్కలకు 22 కేజీలు పప్పు వస్తుంది. మరో 3 కేజీలు ముక్కలు, తొక్కలు ఒక బస్తాకు 50 కేజీలు వస్తాయని.దీని ప్రకారం ప్రస్తుత మార్కెట్లో ధరల ప్రకారం సుమారు బస్తాకు రూ. 19,400/- లు ఆదాయం వ్యాపారులకు వస్తుందని తెలిపారు మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని జీడి రైతులకు న్యాయ మైన ధర చెల్లించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు మన దేశంలో జీడి సాగులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని. అనకాపల్లి జిల్లాలో 90 వేల ఎకరాల్లో జీడి సాగు చేస్తున్నారనీ వేలాది మంది రైతులు గిరిజనులు ధళితులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. 25 వేల మెట్రిక్ టన్నులు జీడి పిక్కలు ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. నాన్ షేడ్యూల్డ్ గిరిజన, తీర ప్రాంతంలో నీటి వనరులు లేని మెట్ట ప్రాంతంలో జీడి పంట ప్రధాన మైన వాణిజ్య సాగుగా రైతులు పండిస్తున్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాద్యాక్షులు కె భవానీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షు బి టి దొర గిట్టూరి అప్పారావు సోలం చంద్ర శేఖర్ సాగరిఈశ్వరావు సోమేల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments