Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshబోర్లు మరమ్మత్తుల వివరాలు తెలపండి

బోర్లు మరమ్మత్తుల వివరాలు తెలపండి

రానున్న వేసవి నేపథ్యంలో మాడుగుల పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గ్రామపంచాయతీ తగు చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ ఎడ్ల కళావతి సోమవారం మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఎక్కడైనా బోర్లు మరమ్మత్తులకు గురి అయితే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. ఏ వీధిలో బోర్లు మరమ్మతులు చేయాలో తెలియచేసిన యెడల వెంటనే మంచినీటికీ ఇబ్బందులు లేకుండా బోర్లు మరమ్మతులు చేయించడం జరుగుతుందన్నారు. అయితే మాడుగుల మోదమాంబ కాలనీలో పలుచోట్ల మంచినీరు సక్రమంగా రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని సర్పంచ్ చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments