Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshకాకరపాడు గురుకులంలో కఠిన చర్యలు...ప్రిన్సిపాల్‌, డిప్యూటీ వార్డెన్ సస్పెన్షన్.

కాకరపాడు గురుకులంలో కఠిన చర్యలు…ప్రిన్సిపాల్‌, డిప్యూటీ వార్డెన్ సస్పెన్షన్.

ఏటీడబల్యూఓ క్రాంతి కుమార్.

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలుర)లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణుడును విధుల నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఏ. లీలావతి ఏఎన్ఎం-కమ్-డిప్యూటీ వార్డెన్ ను కూడా సస్పెండ్ చేసినట్లు గురుకులం కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారని ఏటీడబల్యూఓ క్రాంతికుమార్ తెలిపారు.అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న ఏ. పద్మావతి (ఎంపీ హెచ్ డబ్ల్యూ) ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల బాలికల విద్యాసంస్థ, అరకు వ్యాలీకి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.కళాశాల నిర్వహణలో అంతరాయం కలగకుండా ఉండేందుకు రసాయన శాస్త్రం జూనియర్ లెక్చరర్ జె. సత్యనారాయణను కళాశాల ప్రిన్సిపాల్ అదనపు బాధ్యతలతో (ఫుల్ అడిషనల్ ఛార్జ్) నియమించినట్లు ఏటిడబ్ల్యుఓ క్రాంతికుమార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments