8వ ప్రధానమంత్రి భారతీయ జన ఔషది దివాస్ వారోత్సవాల సందర్భంగా గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో వైద్యశిబిరాన్ని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ ఈ. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో 30 మంది వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. బిపి, షుగర్ మరియు కంటికి సంబంధించిన మందులను జన ఔషధి కేంద్రం ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం జిల్లా చైర్మన్ కె.ఆర్.డి ప్రసాదరావు, సెక్రెటరీ కె. సత్యం,సిబ్బంది, జన ఔషది కేంద్రం ఫార్మసిస్ట్ మమత మరియు రెడ్ క్రాస్ సిబ్బంది హాజరై వృద్దులకు మందులు పంపిణీ చేయడం జరిగింది.
నిరాశ్రయులకు ఆరోగ్య శిబిరం
RELATED ARTICLES
