Saturday, May 2, 2026
HomePoliticsAndhra Pradeshమహిళా దినోత్సవం నేపథ్యంలో వాకథన్ ర్యాలీ

మహిళా దినోత్సవం నేపథ్యంలో వాకథన్ ర్యాలీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2026 పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా సాధికారికత వారోత్సవాలలో భాగంగా బుధవారం మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థినిలతో కలిసి అవగాహన వాకథన్ ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఆదేశాలు, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సూచనల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ సుభద్రమ్మ, ఇన్‌స్పెక్టర్ కే. మంగాదేవి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, గోకవరం బస్టాండ్ మీదుగా దేవి చౌక్ వరకు సాగింది.
ఈ సందర్భంగా డీఎస్పీ సుభద్రమ్మ మాట్లాడుతూ మహిళల సాధికారతకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి” యాప్‌ను ప్రతి మహిళ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాల ద్వారా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, కళాశాలలు తదితర ప్రాంతాల్లో మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments