Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshస్నేహ స్వభావి .. కల్మషం లేని వ్యక్తి రాంబాబు

స్నేహ స్వభావి .. కల్మషం లేని వ్యక్తి రాంబాబు

రాంబాబు జన్మదినం సందర్బంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మిత్రబృందం

స్నేహ స్వభావి.. అందరివాడు .. కల్మషం లేని వ్యక్తి రాంబాబు అని ఆదిత్య స్కూల్ ప్రిన్సిపాల్ తొత్తర శ్రీనివాస్ అన్నారు. శ్రీ చాగంటి వారి శిష్యులు,దర్శకులు కే రాఘవేంద్రరావు ప్రియ శిష్యులు, నటులు శోభన్ బాబు వీరాభిమాని, ఫ్రెండ్స్ ఫరెవర్ సలహాదారులు, మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్ మరియు కన్వీనర్ బొండా రాంబాబు అని
కో. కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ పి. ర్. ఓ. భట్టిప్రోలు శ్రీనివాసరావు, బంగారు రాము, పులవర్తి రామకృష్ణ అన్నారు.పుట్టినరోజు వేడుకలను తాడిమళ్ళ వారి కాంప్లెక్స్ లో మిత్రుల మధ్య నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ అందరితో సొంత మనిషిలా కలిసి ఆప్యాయంగా పలకరించే మనసున్న మనస్తత్వం ఉన్న వ్యక్తి రాంబాబు, ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. భీమవరం డిఎన్నార్ విద్యాసంస్థల మాజీ కోశాధికారి, భీమవరం
డి ఎన్ ఆర్ అలుమ్ని కార్యదర్శి, లియో క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ జిల్లా ప్రెసిడెంట్, చైతన్య భారతి కోశాధికారి, డిఎన్నార్ లా కళాశాల సభ్యులు, శోభన్ బాబు సేవాసమితి సభ్యులు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు, మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్, కన్వీనర్ గా రాంబాబు అనేక పదవులను చేపట్టారని అన్నారు. ముందుగా వారికి అమంచి కృష్ణ మోహన్ ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. వెస్ట్ బెర్రీ డైరెక్టర్ నడింపల్లి మహేష్, కారుమూరి సత్యనారాయణ, బొండా హనుమంతరావు, కనగర్ల రామకృష్ణ,కారుమూరి బదరి కురిశెట్టి సతీష్, మానేపల్లి రవి చిన్నారావు,లయన్స్ క్లబ్ సభ్యులు,మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు వాకర్స్ సభ్యులు, రాంబాబు బాల్య స్నేహితులు కార్యక్రమం లో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments