Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshనీటి సంరక్షణ" అందరి బాధ్యత..

నీటి సంరక్షణ” అందరి బాధ్యత..

అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం, 42వ డివిజన్ కామాక్షి నగర్, అయ్యన్నపేట మున్సిపల్ నడక మైదానం వద్ద నున్న మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ప్లాంట్ వద్ద వాకర్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు నీటి సంరక్షణ పై అవగాహన కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణ నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ.తిరుపతిరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ సాహితీవేత్త,డాక్టర్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ
నీటి సంరక్షణ అంటే లభ్యతలో ఉన్న నీటి వనరులను వృథా చేయకుండా.. బాధ్యతాయుతంగా మరియు సమర్థవంతంగా ఉపయోగించడమని, వర్షపు నీటిని నిల్వ చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం మరియు భవిష్యత్ తరాల కోసం నీటిని దాచుకోవడం వంటి పద్ధతులను కలిగి ఉండాలని, కుళాయిలు పైపుల లీకేజీలను అరికట్టడం, అవసరమైనంత మేరకే నీటిని వాడటం,
వర్షపు నీటి నిల్వచేసి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి,వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం, కూరగాయలు కడిగిన మిగిలిన నీటిని మొక్కలకు లేదా ఇతర అవసరాలకు ఉపయోగించడం వంటి పొదుపు చేయాలని సూచించారు. అనంతరం క్లబ్ సభ్యులంతా నీటి సంరక్షణ పై నినాదాలను ఇచ్చారు.
కార్యక్రమంలో డిప్యూటీ గవర్నర్ తాడ్డి ఆదినారాయణ, జాలీ వాకర్ వై. నలమహారాజు, క్లబ్ ఉపాధ్యక్షులు పెనుమత్స అప్పలరాజు, జి. సూర్యప్రకాశరావు ఎస్సై, క్లబ్ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు,జాయింట్ కార్యదర్శి ఇందుకూరి అప్పలరాజు,ఎడ్ల శ్రీనివాసరావు,క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ, ప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments