Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshసాంబయ్య పాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

సాంబయ్య పాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

తాసిల్దార్ భారతి

శ్రీకాళహస్తినియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని సాంబయ్యపాలెం గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు 350 మంది లబ్ధిదారులకు తాసిల్దార్ భారతి అందజేశారు.తాసిల్దార్ భారతి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు భూ రీసర్వే జరిగిన ప్రాంతాలన్నీటి వద్ద రాజముద్రతో క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలియజేశారు.ఈ పట్టా పాస్ పుస్తకాలను తీసుకొని రైతులు ఆనందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.ప్రజలకు సేవ చేయడానికి రెవెన్యూశాఖ ఉందని, కాబట్టి ప్రజలు తమ సమస్యలను రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకుని వస్తే వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, ప్రతి సోమవారం రెవెన్యూ కార్యాలయాల నందు గ్రీవెన్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో ఉన్నతాధికారులు ప్రజలతో వారి సమస్యలను నేరుగా తెలుసుకొని సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడుతున్నామని, కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో
ఆర్ ఐ నారాయణ,వీఆర్వోలు కన్నయ్య,రవి,దినేష్ రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments