రొటీన్ చెకప్.. బాగానే ఉన్నా – బొత్స వెల్లడి
వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయన అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో బొత్స సత్యనారాయణ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘నా ఆరోగ్యంపై ఆందోళన అనవసరం. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రొటీన్ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చాను’ అంటూ మాజీ మంత్రి స్పష్టం చేశారు.
