అల్లూరి జిల్లా కొయ్యురు మండల పరిది రాజేంద్రపాలెం లో జుర్రా రమణబాబు ప్రేమ కుమారి దంపతుల చిన్న కుమార్తె అఖిల వాణి ఫంక్షన్ కి హాజరైన కొయ్యూరు మండలం ఎంపీపీ బడుగు రమేష్ కూటమి నాయకులు బోండ్ల చిరంజీవి, ప్రజా గర్జన సీఈవో చల్లంగి వినోద్ తదితరులు ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ, అఖిల భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండాలని కోరారు.
కూటమి నాయకులు బోండ్ల చిరంజీవి మాట్లాడుతూ, అఖిల చదువులో మరింతగా ముందుకు వెళ్లాలని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలని కోరారు.
ప్రజా గర్జన సీఈవో చల్లంగి వినోద్ మాట్లాడుతూ, అఖిల తల్లిదండ్రులకు మరింత ఆనందాన్ని ఇవ్వాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అఖిల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.
