అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ డౌనూరు గ్రామ సచివాలయంలో శుక్రవారం స్వచ్ఛ రథం వాహనం చేరుకుంది. ఈ వాహనం ద్వారా గ్రామ ప్రజలు తమ ఇళ్లల్లో పనికిరాని పాత వస్తువులను ఇచ్చి వాటి బదులుగా నిత్యవసర సరుకులు పొందే అవకాశం కల్పించబడింది. స్వచ్ఛరదం ప్రతి నెలలో ఒకసారి గ్రామానికి వచ్చి ఈ సేవలను అందించినట్లు కార్యదర్శి రేష్మ తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల మహిళ అధ్యక్షురాలు బోనంగి సత్య సర్పంచ్ పొట్టికభవాని, కూటమి నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, పాల్గొన్నారు.
