Sunday, May 31, 2026
HomePoliticsAndhra Pradeshహాస్టల్ విద్యార్థులకు టవల్స్ పంపిణీ

హాస్టల్ విద్యార్థులకు టవల్స్ పంపిణీ

కలెక్టర్ హరేందిరా ప్రసాద్

సీతమ్మధార సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులకు టర్కీ టవల్స్ ని జిల్లా కలెక్టర్ ఎం ఎం హరేంద్ర ప్రసాద్ శుక్రవారం సీతమ్మధార సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహం, కళాశాల బాలుర వసతి గృహం విద్యార్థులకు అందజేశారు. వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన మెనూ అమలు జరిగింది లేనిది, అలాగే సురక్షితమైన తాగునీరు ఆరోగ్యకరమైన వైద్య సేవలు,సదుపాయాలు ఎలా ఉన్నాయని కలెక్టర్ ఆరా తీశారు. వసతి గృహాలలోని విద్యార్థుల తో ముచ్చటిస్తూ విద్యార్థి దశలో కష్టపడి చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకోవడం ద్వారా వారి తల్లిదండ్రులకు దేశానికి మంచి సేవ చేయాలని ఉపదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కే రామారావు, సర్వ శిక్ష అభియాన్ సమన్వయకర్త ఈ నరసింహారావు పాల్గొన్నారు. హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తగు సూచనలు కూడా చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments