Wednesday, June 3, 2026
HomePoliticsAndhra Pradeshకోమల్లపూడిలో జ్యోతిర్లింగాల ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభం

కోమల్లపూడిలో జ్యోతిర్లింగాల ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభం

మండలంలోని కోమల్లపూడిలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర స్వామి సహిత జ్యోతిర్లింగాలు, విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈ నెల 25,26, 27 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ తెలిపారు.మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా గురువారం నుండి హోమాదికాలు విశేష పూజలు జరుగుతాయి అన్నారు.ఈ నెల 27న చివరి రోజు కోనేరులో ఏర్పాటుచేసిన శివపార్వతుల విగ్రహాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ధ్వజస్తంభం,సింహద్వారం ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తామన్నారు.ఈ సందర్భంగా 27న ఎడ్ల పరుగు పందెం పోటీలు, కోలాటం పోటీలు తప్పటగుళ్ల పోటీలు నిర్వహించి విజేతలకు నగదు పురస్కారం అందిస్తామన్నారు.భారీగా బాణాసంచా కాల్పులు ఉంటాయన్నారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.ఆలయం వద్ద బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజులపాటు భక్తులకు భారీగా అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, చోడవరం ఎమ్మెల్యే రాజు, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్,పలువురు ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు హాజరవుతారు అన్నారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments