నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ గా జరిమానా
వాహన యాజమానికి ఆన్ లైన్ ద్వారా చలానా
నగరంలోని 90 జంక్షన్లలో అమలుకు కసరత్తు
ప్రాజెక్టు సారథి పేరిట అమలు
సమీక్షించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
విశాఖ నగరంలో చేపట్టబోతున్న ప్రాజెక్టు సారథి (సిస్టమేటిక్ ఆగ్మెంటెడ్ రేడియల్ ట్రాఫిక్ అండ్ హూప్ ఇండక్షన్) అమలకు సంబంధించి కార్యాచరణ పై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీ ఆపరేషన్ సెంటర్ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీతో, టెండర్ నందు పాల్గొన్న బిడ్డరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్కును నియంత్రించేందుకు ప్రాజెక్టు సారధిని అమల్లోనికి తీసుకురావడం జరుగుతున్న నేపథ్యంలో ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం) ను 90 జంక్షన్ లలో ఏర్పాటు చేసేందుకు, అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం ను 101 జంక్షన్ లలో సిటీ ఆపరేషన్స్ సెంటర్ కు అనుసంధానం చేసేందుకు టెండర్లను ఆహ్వానించడం జరిగిందన్నారు. టెండర్లలో ముగ్గురు ఏజెన్సీలు పాల్గొనగా ఫ్రీ క్వాలిఫికేషన్ కు అర్హులయ్యారన్నారు. తదుపరి టెండర్ ప్రక్రియలకు సంబంధించి మూడు ఏజెన్సీలకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసేందుకు మూడు జంక్షన్ లను నిర్వహణకు సూచించడం అయినదన్నారు. ఈ నిర్వహణకు సంబంధించి బిడ్డర్ల తదుపరి దశను మంజూరు చేసేందుకుగాను తదుపరి చర్య కోసం జీవీఎంసీ అదనపు కమిషనర్ ఫైనాన్స్ ఎస్ ఎస్ వర్మ, ప్రధాన ఇంజనీర్ పి వి వి సత్యనారాయణ రాజు, వి ఏం ఆర్ డి ఏ ప్రధాన ఇంజనీరు వినయ్ కుమార్, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీరు ఏడుకొండలు,అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ దుర్గారాణి, పబ్లిక్ హెల్త్ పర్యవేక్షక ఇంజనీర్ కామేశ్వరరావు లతో కలిసి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడమైనదన్నారు. ముగ్గురు ఏజెన్సీలు పొందుపరిచిన వివరాలను, సాంకేతిక ప్రదర్శనను సిటీ ఆపరేషన్స్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కమిటీ నేడు తిలకించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. టెండర్లు మంజూరు అనంతరం ప్రాజెక్టు సారథి ద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు, వాహనాల రాకపోకలకు వీలుగా ఏ టి సి ఎస్ సిస్టం 101 జంక్షన్ లలో అమలు చేయడం జరుగునన్నారు. ఈ సిస్టం ద్వారా ట్రాఫిక్ రద్దీ కి అనుగుణంగా గ్రీన్ సిగ్నల్ ఆటోమేటిక్గా ఇండికేట్ అవుతుందన్నారు. అలాగే వీఐపీ రాకపోకలప్పుడు ట్రాఫిక్ నకు అంతరాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ వచ్చేలాగా సిఓసి ద్వారా ఆపరేషన్ కూడా జరుగుతుందన్నారు. అలాగే ఎ ఐ బేస్డ్ ఐటీఎంఎస్ సిస్టం 90 జంక్షన్లో ఏర్పాటు చేస్తున్నామని , ఏ ఎన్ పి ఆర్ & ఆర్ ఎల్ వి డి కెమెరాల ద్వారా ట్రాఫిక్ వైలేషన్ డిటెక్షన్ చేసి ఆటోమేటిగ్గా ఫైన్ ఇంపోజ్ కు సంబంధించి చలానా జనరేట్ చెంది వాహన యజమానికి అందుతుందన్నారు.
