Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshఏక సభ్య కమిషన్ కు ఓకే

ఏక సభ్య కమిషన్ కు ఓకే

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో ఏక సభ్య కమిటీ ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

లడ్డూ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇచ్చిన నివేదికపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ నివేదికను పరిశీలించి.. పరిపాలనా లోపాలు, టెండర్ అవకతవకలు, బాధ్యులను గుర్తించడానికే ఈ కమిటీని నియమించినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది ప్రభుత్వం. అలాగే సీబీఐ సిట్ విచారణకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments