ఈనెల ఫిబ్రవరి 25 నుండి 28 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జరుగుతున్న 14 సీనియర్ పారా సెట్టింగ్ వాలీబాల్ నేషనల్స్ టోర్నమెంట్ కి అనకాపల్లి జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ టీం కి బుచ్చయ్య పేట గ్రామానికి చెందిన గాడి సురేష్ అనే యువకుడు ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ కి ఎంపిక కావడంతో గ్రామం లో సురేష్ ను పలువురు నాయకులు, యువకులు అభినందించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ బోడపాటి శివధత్ అసోసియేషన్ మెంబర్స్ కి సురేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సురేష్ తెలిపారు.
