ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థుల విజయం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో జరిగిన ప్రాంగణ ఉద్యోగ ఎంపికల్లో విద్యార్థులు 77 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను పొందారనీ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నిర్వహించిన ఎంపికల్లో భారీగా విద్యార్థులు ఉద్యోగాలు పొందడం అభినందనీయమని ఆయన అన్నారు, వార్షిక ఆదాయం మూడు లక్షలతో ప్రారంభ వేతనాలు పొందడం కళాశాలలో సాంకేతికపరమైన విద్యా . బోధనలు అధ్యాపకులు నిరంతర ప్రక్రియగా కొనసాగడం వల్లే క్యాంపస్ ఉద్యోగాలు లభిస్తున్నాయని డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ డీన్ డాక్టర్ ఎం సంతోష్ కుమార్, శిక్షణ విభాగాధిపతి డాక్టర్ శ్రీకాంత్, పలువురు అధ్యాపకులు అభినందించారు.
