దాతలు ముందుకు రండి
ఇంతవరకు ఎవరికీ సోకని ఎస్ ఎం ఎ టైప్ వన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు పునర్జన్మ ప్రసాదించే విధంగా ప్రతి ఒక్కరు సహకరి అందించాలని కొత్తకోట ఐ లవ్ ఇండియా యువజన బృందం ప్రజలను కోరుతుంది. ఈమె వ్యాధి నయుం కావాలంటే 16 కోట్లు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపిన నైవేద్యంలో ఆ యువకులు ముందుకు వచ్చి విరాళాలు సేకరిస్తున్నారు. మానవత్వంతో ఉన్న ప్రతి ఒక్కరు ఈ చిన్నారిని ఆదుకునే విధంగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. 16 కోట్ల విలువ గల ఒక ఇంజక్షన్ ఇస్తే అమ్మాయి జీవం పోసుకుంటుందని కాబట్టి దాతల ముందుకు రావాలని కోరుతున్నారు.
