Sunday, April 26, 2026
HomePoliticsAndhra Pradeshఅన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని, గోకవరం మెయిన్ రోడ్డులో ఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి, శ్రీ ఉమా గోకర్నేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలిత ఆయనకు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్ని, భక్తులకు వడ్డించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ అన్నసమారాధన కార్యక్రమానికి వంటలు చేసిన అమ్మాజీ అనే మహిళలకు 20 వేలు రూపాయలు అందించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో 15 వేల మందికి, పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై.రామవరం మండలం పూతికుంట, గురబంధ, రేగడిపాలెం అలాగే రంపచోడవరం మండలం చిన్న గెద్దాడ, గంగవరం మండలం శర్బవరం, పైడి పుట్ట, అలాగే రాజొమ్మగి మండలం కిరాబు, లబ్బర్తి, నెల్లి మెట్ల గ్రామాలలోని శివాలయాల వద్ద 10 వేల మందికి, మొత్తం కలిపి 25 వేల మందికి అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలుపారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments