Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఅప్పన్న హుండీ ఆదాయం రూ. 1.49 కోట్లు

అప్పన్న హుండీ ఆదాయం రూ. 1.49 కోట్లు

అప్పన్న కు విదేశీ భక్తులు తాకిడి
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి జె. వెంకట్రావు ఆధ్వర్యంలో, అకౌంట్ సెక్షన్ ఏఇఓ వాడ్రేవు రమణమూర్తి, పర్యవేక్షణ అధికారి రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించబడింది.
​ఈ లెక్కింపు ప్రక్రియలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ టి. అన్నపూర్ణ, భీమేశ్వర రాజరాజేశ్వరి ఆలయ ఈవో నీలిమ, ఉమా నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ (రైల్వే న్యూ కాలనీ) ఈవో పి.ఎల్.ఎన్.ఎస్. రాజు పాల్గొన్నారు. ఎస్.పి.ఎఫ్. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ కార్యక్రమం కొనసాగింది.
జనవరి తేది 28.01.2026 నుండి 18.02.2026 వరకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు, సిబ్బంది ,సేవాదారులు లెక్కించారు. ఈ లెక్కింపులో స్వామివారికి నగదు రూపంలో మొత్తం రూ. 1,49,03,091/- ఆదాయం లభించింది.
​నోట్ల రూపంలో వచ్చినది: రూ. 1,38,86,627/-
​నాణేల (చిల్లర) రూపంలో వచ్చినది: రూ.10,16,464/-
​సగటు రోజువారీ ఆదాయం: రూ. 7,09,671/-
​బంగారం మరియు వెండి కానుకలు:
​బంగారం: 187 గ్రాముల 180 మిల్లీగ్రాములు.
​వెండి: 5 కిలోల 775 గ్రాములు.

​దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు సమర్పించిన కరెన్సీలో ముఖ్యంగా అమెరికా 190 డాలర్లు, మలేషియా 1789 రింగిట్స్, ఆస్ట్రేలియా 100 డాలర్లు తో పాటుగా యూఏఈ, ఖతార్, ఇంగ్లాండ్, ఉజ్బెకిస్తాన్, సింగపూర్, నేపాల్ మరియు సౌదీ అరేబియా దేశాల నోట్లు లభించాయి.
​ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది మరియు ఎస్.పి.ఎఫ్. రక్షణ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments