తాడువాయిలో ఘనంగా భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కళ్యాణం
భారీ గా భక్తులకు అన్న సమారాధన
మూడో రోజు స్వామి దర్శించుకున్న భక్తులు
స్థానిక మండలం లోని తాడువాయి గ్రామంలో స్వయంభువు లైన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి కళ్యాణం కనుల పండుగగాజరిగింది.మూడో రోజు మంగళవారం
దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతల పుల్లారావు, ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ చేతుల మీదగా దేవస్థానం వద్ద ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుణాళ్ళు మూడవరోజు కావటం వల్ల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతల పుల్లారావు మాట్లాడుతూ
కార్యక్రమంలో భాగంగా బుధ గురువారాల్లో దేవస్థానం వద్ద పూజా కార్యక్రమాలు జరుగుతాయని నాలుగో రోజు బుధవారం అనంత ఈశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని, గురువారం ఐదవ రోజు తో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామిని దర్శించాలని కోరారు. ఆలయం వద్ద రాత్రి సమయంలో వినోద సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని భక్తులు తిలకించాలని కోరారు. కార్యక్రమంలో పిన్నమనేని నాని, కొడవటి సత్తిరాజు, ఎంపీటీసీ పొడపాటి నందిని, సర్పంచ్ యరమల సత్యవతి
కొడవటి వెంకటేశ్వరరావు, పాపోలు వెంకట శ్రీనివాస్, ఉప్పునూతల శ్రీను, కాసారపు వెంకటరమణ, కాసారపు నారాయణ, పొన్నగంటి మహి, పాల్గొన్నారు. దేవస్థానం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించగా జంగారెడ్డిగూడెం సీఐ ఎం వి సుభాష్, ఎస్సై వీరప్రసాద్, పోలీస్ సిబ్బంది సహకారం అందించారని కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
