పాత్రికేయ విమర్శకుడు, కళా ప్రోత్సాహకుడు స్వర్గీయ భట్టిప్రోలు మధుసూధనరావు 40వ వర్ధంతి
మాటలకందని మధుశ్రీ రచనలతో చరిత్రకెక్కిన పాత్రికేయ విమర్శకుడు, కళా ప్రోత్సాహకుడు స్వర్గీయ భట్టిప్రోలు మధుసూధనరావు. మధుసూధనరావు 1986 ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. భీమవరంలో భట్టిప్రోలు మధుసూధనరావు 40వ వర్ధంతి సందర్బంగా పలువురు వక్తలు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మధుశ్రీ పేరుతో ఆయన ఎన్నో రచనలు రాశారని, మధుశ్రీకలం పేరుతో సినీ రంగానికి అయన సుపరిచితులన్నారు. 1965లో ఫిలిం జర్నలిస్ట్ గాను, భీమవరం ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగాను, రాష్ట్ర ఫిలిం ఫ్యాన్స్ ఉపాధ్యక్షుడిగా, భీమవరం ప్రెస్ క్లబ్ కోశాధికారిగా, అంకాల ఆర్ట్స్ అకాడమీ, శ్రీరామరాజ భూషణ సాహిత్య పరిషత్ కార్యవర్గ సభ్యునిగా అనేక పదవుల్లో పని చేశారని, 1965లో రాష్ట్ర ఫిలిం ఫ్యాన్స్ మహాసభలు భీమవరంలో నిర్వహించారన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు మాట్లాడుతూ ఆయనకు సినిమా జర్నలిజం అంటే మక్కువ అని, సినిమా జర్నలిజానికి మధుశ్రీ చేసిన కృషికి విజయవాడ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ఘనంగా సన్మించిందన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో యస్ డిఎఫ్ తరపున నందమూరి తారక రామారావు బృందంతో తన అసోసియేషన్ ద్వారా భీమవరం నుండి 1,116 విరాళాన్ని సేకరించిన మహామనీషి భట్టిప్రోలు అని అన్నారు. కారుమూరి భాస్కరరావు మాట్లాడుతూ ప్రసిద్ధ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, మధుర గాయకుడు ఘంటసాల వంటి ప్రముఖులను భీమవరం తీసుకువచ్చి తమ సంస్థ ద్వారా సన్మానించేవారన్నారు. ప్రముఖ గాయకుడు పీఠాపురం నాగేశ్వరరావుకు ఆంధ్రా రఫీ అనే బిరుదుతో సత్కరించారని, భీమవరంలో కురిశేటి వారి వ్యాపారసంస్థల్లో మూడు దశాబ్దాలపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారని వారి సేవలను, వారిలాగే వారి కుమారుడు భట్టిప్రోలు శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు అని కొనియాడారు.
