Friday, April 24, 2026
HomePoliticsAndhra Pradeshశివపార్వతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రమేష్

శివపార్వతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రమేష్

 

అనకాపల్లి (జయ జయహే) బుచ్చయ్యపేట మండలం పి.భీమవరంలోశ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి మహా పర్వదినం సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.గ్రామానికి విచ్చేసిన ఎంపీ కి మహిళలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం భీమ కుండ (భీమ శంకర పుష్కరిణి) వద్ద శివపార్వతుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.తదనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ ఇంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించిన టిడిపి నాయకులు దాసు ని అభినందించారు.గ్రామస్తుల అభ్యర్థన మేరకు విశ్రాంతి భవనం అవసరమని కోరగా దానిపై సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠకు సహకరించిన దాతలను ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ,మల్లు నాయుడు ,గేదల సత్యనారాయణ ,డీసీఎంఎస్ చైర్మన్ కోట్ను బాలాజీ , వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఈర్లె శ్రీరామ మూర్తి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments