అనంతగిరి: జయ జయహే.
7కిలోమీటర్లు కొండెక్కిన విద్యుత్ శాఖ అధికారులు.
దబ్బలపాడు గ్రామాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు
రిపోర్టు తెలియజేస్తున్న విద్యుత్ అధికారులు.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ కొండ సికార గ్రామమైన దబ్బలపాడు గ్రామంలో ఎనిమిది కుటుంబ గిరిజనులు కొండ చివర పై జీవనం సాగిస్తున్నారు.
దబ్బలపాడు గ్రామానికి కనీసం కరెంటు సౌకర్యం లేకపోవడంతో రాత్రివేళ పెద్ద పులులు సంచరించడంతో 2023 సంవత్సరంలో దబ్బలపాడు గ్రామాన్ని ఖాళీ చేసి కొంతమంది కిందికి వెళ్లిపోయారు. గ్రామస్తులు ఎటు వెళ్లలేక నాలుగు కొండల మధ్యలో జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించాలని ఏపీ ఈ పి డి సి ఎల్ సీఎం కు ఫోన్ చేయడంతో వార్తాపత్రికలో ప్రచురించడంతో అనంతగిరి అసిస్టెంట్ ఇంజనీర్ లైన్ ఇన్స్పెక్టర్ లైన్మెన్ కె శ్రీనివాసరావు. ఎన్ తిరుపతిరావు. ఆరు కిలోమీటర్లు ఎత్తైన కొండచికార గ్రామానికి కాలినడకతో వెళ్లి స్వయాన గిరిజనులు గ్రామాన్ని సందర్శించారు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ పరిచయం చేసి గ్రామాన్ని సందర్శించిన విద్యుత్ శాఖ అధికారులు రిపోర్టుని జిల్లా అధికారికి పంపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు విద్యుత్ అధికారిలు దగ్గరుండి కొండపైకి తీసుకు వెళ్లడం జరిగింది.
