Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshసబ్‌స్టెన్స్ అభ్యూస్ నివారణపై అవగాహన

సబ్‌స్టెన్స్ అభ్యూస్ నివారణపై అవగాహన

గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మర్రిపాలెం లో పీఎం ఉషా కార్యక్రమం క్రింద జిఐఇఐ పథకం ద్వారా “సుబస్టెన్స్ అబ్యూస్ ప్రెవేన్షన్ డ్రైవ్ ” పేరిట అవగాహన వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. చిట్టి అబ్బాయి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా గవర్నమెంట్ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా. కె. సుధ వ్యవహరించగా, కో–ఆర్డినేటరర్స్ గా ఇంగ్లీష్ విభాగం లెక్చరర్ డా. జి. మేరీ పుష్ప , భువనేశ్వరి దేవి బాధ్యతలు నిర్వర్తించారు.
వర్క్‌షాప్‌కు రిసోర్స్ పర్సన్‌గా శ్రీ సాయి సత్యనారాయణ సత్విక్, ఎక్స్ టెక్ సొల్యూషన్స్ ఎల్ ఎల్ పి సంస్థ సీఈఓ మరియు ఏచ్ ఆర్ హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను స్పష్టంగా వివరించారు. డ్రగ్స్ ఎలా యువతను దారితప్పిస్తున్నాయో, ఎలాంటి నిజజీవిత సంఘటనల ద్వారా మోసపోతున్నారో, ముఖ్యంగా అమ్మాయిలు ఎలా అపహరింపబడి డ్రగ్స్‌కు బానిసలవుతున్నారో ఉదాహరణలతో వివరించారు. జీవితం పట్ల జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు విలువైన సూచనలు ఇచ్చారు.
తన ప్రవచనంలో భాగంగా, స్వయంగా తన వ్యయంతో 40 మంది విద్యార్థులకు ఉచిత సాఫ్ట్‌వేర్ శిక్షణ అందిస్తానని ప్రకటించడంతో కళాశాల సిబ్బందిలో, విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమైంది. శిక్షణ పొందేందుకు విద్యార్థులు తమ ఆసక్తిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 115 మంది విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments