మంత్రి లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్
– భారీ కేక్ కటింగ్
డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిన రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారీ కేక్ కట్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తర్వాత వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షులు సి హెచ్ పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శి నొడగల కృష్ణ పాల్గొని కేక్ కటింగ్ చేశారు. అనంతరం వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలను మంజూరు చేసి విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పించారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్న నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన నిలిచే వ్యక్తి అని, రాష్ట్రవ్యాప్తంగా యువత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు సి హెచ్ పట్టాభిరామ్ మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను తెలుసుకొని వారికి అండగా నిలిచిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వైశ్యా కార్పొరేషన్ డైరెక్టర్ కే రూప, కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కోట నరేష్, టీడీపీ కమిటీ సభ్యులు పోతన్న రెడ్డి, సభ్యురాలు జి.సత్య, జనసేన నాయకులు డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్, రాజేష్, పోతు ప్రసాద్, టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు బోండా రవి , గౌస్, శివ , పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం బెలూన్లు ఎగురవేసి, మిఠాయిలు పంచిపెట్టి, ఆనందం వ్యక్తం చేశారు.
