Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshచోడవరం లో దేశ వ్యాప్తంగా సమ్మె విజయవంతం

చోడవరం లో దేశ వ్యాప్తంగా సమ్మె విజయవంతం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం చోడవరంలో నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె చోడవరంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రైతుకూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ(న్యూ) ఆధ్వర్యం వహించాయి. చోడవరం పాత బస్టాండ్ సెంటర్ నుండి కొత్తూరు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు
ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు మాట్లాడుతూ,” కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుండి కార్మికులు అనేక వీరోచిత పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కుదిస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి, కార్మిక హక్కులను దెబ్బతీసిందని, వ్యవసాయాధారిత పరిశ్రమలైన షుగర్ ఫ్యాక్టరీలను నాశనం చేసి, రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించకుండా ఉద్దేశ్యపూరితంగానే వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రైతాంగ రుణమాఫీలు అమలు చేయలేని ప్రభుత్వాలు, కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్నారని, ఈ విధానాల ఫలితంగానే రైతాంగ ఆత్మహత్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని, దేశ స్వావలంబన ను తాకట్టు పెడుతూ, రైతాంగ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో
ఏఐ ఎఫ్ టి యూ(న్యూ) జిల్లా నాయకులు అయితిరెడ్డి అప్పలనాయుడు,నవ యువ సమాఖ్య జిల్లా కన్వీనర్ నందారపు భాస్కర్ రావు,రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) జిల్లా ఉపాధ్యక్షుడు పైలి రమేష్,స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కన్వీనర్ ఓ లక్ష్మీ కుమారి, క్వారీ కార్మిక సంఘం నాయకులు చింతల రమేష్ ,రైతు కూలీ సంఘం సభ్యులు కిళ్ళి దేముడు,కె.కోటేశ్వరరావు,గండి సత్యం,బలిన అమ్మినాయుడు,నమ్మి అప్పలరాజు,కెంబూరి కల్పన, ఆర్ కుమారి, రాజాం, చౌడువాడ, పాచిలవానిపాలెం చోడవరం తదితరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments