Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshమాడుగుల లో దేశ వ్యాప్త సమ్మె విజయవంతం

మాడుగుల లో దేశ వ్యాప్త సమ్మె విజయవంతం

మాడుగుల మండలంలో గురువారం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె విజయవంతం అయింది. ఈ సందర్భంగా గాంధీ పార్కు నుంచి గెడ్డ బడి మీదుగా మోదమాంబ పాదాల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీగా వచ్చి ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ వద్ద మానవహారం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్మికులకు హాని కలిగించే నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, మహాత్మా గాంధీ పేరును తొలగించడం దారుణమని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, అధిక బిల్లులు ప్రజలపై మాపొద్దని, గ్యాస్ సబ్సిడీ ప్రతి నెల అర్హులైన వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీడి పంటకు కేజీ 200 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు అనేక కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెను అంగన్వాడిలు. ఆయాలు ఆశలు. విఓఎలు పంచాయతీ కార్మికులు మిడ్డి మిల్స్. శానిటేషన్. ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగులు. వ్యవసాయ కూలీలు రైతులు గిరిజనులు వివిధ సంఘల సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి. ఇరట.నరసింహమూర్తి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కే భవాని, మాడుగుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పడాలకొండలో తదితరులు పాల్గొని మాట్లాడారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments