గోకవరం మండలం లోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలల నందు విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి నట్లు జి. కొత్తపల్లి పి. హెచ్. సి. వైద్యాధికారి డా. తిరన్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆప్తాలమిక్ ఆఫీసర్ సి. హెచ్. ఆనందరావు సమక్షంలో ఇదివరలో జరిగిన నేత్ర పరీక్షలకు సంబంధించి నేత్ర లోపం వున్నవారికి కళ్ళజోళ్ళు ఉచితం గా ప్రభుత్వం వారు సరఫరా చేశారని వాటిని వివిధ స్కూల్స్ లో అందజేస్తు న్నామని తెలిపారు. ఈ సందర్బంగా గోకవరం మండలం విద్యాధికారులు శ్రీమతి. గౌరమ్మ, మరియు చిమ్మరాజు దొర సమక్షంలో వీరలంకపల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. వల్లి ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ జరిగింది అదే విధంగా గోకవరం సంజీవయ్యనగర్ ఎమ్. పి.యు. పి. స్కూల్ నందు కూడా పంపిణీ చేసారు.ఈ కార్యక్రమం లో ఎమ్. ఎల్. హెచ్. పి. రమ్య, హెల్త్ అసిస్టెంట్ లు పవన్, నాగేశ్వరావు,ఏ. ఎన్. ఎమ్ లు విశ్వనాధం, బాపనమ్మ, వెంకటలక్ష్మి ఆశాలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినివిద్యార్థులకు కంటి పరీక్షలు
RELATED ARTICLES
