కేంద్రo కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి,కేంద్ర పాలకులు అనుచరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలైన నాలుగు కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని సిపిఎం సిఐటియు జిల్లా ప్రతినిధి నంబూరు షణ్ముఖరావు తెలిపారు.
దేశవ్యాప్తంగా కార్మికుల సంఘాలు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చట్టాలను అన్ని కార్మిక వర్గాలపై రుద్ది బానిసలుగా తయారు చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేక విధానాలుగా ఉన్నాయని టెక్కలి పాత బస్టాండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కార్మిక సంఘాలు అంగన్వాడిలు, ఆయాలు కార్యకర్తలు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేస్తూ అఖిలభారత సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు , అంగన్వాడి యూనియన్ ప్రతినిధులు, నంబూరు షణ్ముఖరావు ,బాగాది వాసు దేవరావు, న్యాయవాది మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
